calender_icon.png 27 October, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలకడ

27-10-2025 02:03:47 AM

నేనెప్పుడూ ఒకేలా ఉంటాను

మనసును మాత్రం 

నిలకడగా నిలుపుతూనే ఉంటాను -

కర్మాగారంలో

పనిచేసే కార్మికుడినైనా

పదవి కిరీటం ధరించిన

మహానాయకుడినైనా

మహదానందంలో తేలియాడినా

దుర్భర దుఃఖంలో కొట్టుమిట్టాడినా -

సముద్రమంత ఎదిగినా 

వాన చినుకంతై ఒదిగినా

ఉప్పెననై పొంగినా

తెప్పనై నిలిచినా -

అప్పుడూ.. ఇప్పుడూ

నేనెప్పుడూ ఒకేలా ఉంటాను

మనసును మాత్రం 

నిలకడగా నిలుపుతూనే ఉంటాను