20 August, 2026 | 8:17 PM

బెజ్జంకి పీహెచ్‌సీలో సిబ్బందిని నియమించాలి

20-08-2026 07:36 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 24×7 సేవలు అందించాల్సిన పీహెచ్‌సీలో ఒక్క స్టాఫ్‌ నర్సు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.

ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సులు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. బెజ్జంకిలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి, రెండు పీహెచ్‌సీలకు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.