calender_icon.png 2 August, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా సిబ్బంది కృషి చేయాలి: ఆర్ఎం జానిరెడ్డి

01-08-2025 10:46:55 PM

ఆర్టీసీలో ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ..

నల్గొండ రూరల్: ఆర్టీసీకి మరింత ఆదాయం వచ్చేలా ఉద్యోగులు సిబ్బంది సమిష్టి కృషి చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి(District RTC RM Johnny Reddy) అన్నారు. శుక్రవారం నల్లగొండలోని రీజియన్ శిక్షణ హాల్లో ఏర్పాటు చేసిన రీజియన్ స్థాయి ఏప్రిల్ మే జూన్ నెలల ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులలో బాధ్యతగా వ్యవహరించడం వల్ల అధిక ఆదాయం వస్తుందన్నారు.

అవార్డ్ గ్రహితలను ఉద్యోగులలో అణిముత్యాలుగా అభివర్ణిస్తూ వీరిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజులలో ఇతర ఉద్యోగులు అవార్డులు పొందే విధంగా కృషి చేయాలి కోరారు. శ్రావణమాసం, రాఖీ పండుగ సందర్భంగా అత్యధికంగా ఆదాయం సంపాదించి ఆదర్శనంగా నిలవాలని కోరారు. నల్లగొండ రీజన్ పరిధిలో 7 డిపోలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 28 మంది ఉద్యోగులు డ్రైవర్, కండక్టర్లు, టిమ్ము డ్రైవర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు మెకానికులు, శ్రామికులు, ఆర్టిజన్లకు నగదు పురస్కారాలతో సన్మానించారు. ఉత్తమ బస్టాండ్ గా ఎంపికైన మోత్కుర్ బస్టాండ్ కు నగదు బహుమతిని డిఏం యాదగిరిగుట్టకి అందజేశారు.