calender_icon.png 2 August, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

02-08-2025 12:00:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, ఆగస్టు 1 (విజయక్రాంతి) : విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులు, ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.