22-01-2025 12:41:05 AM
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని సోమరాజుకుంటలో నాలుగు అరుదైన శిల్పాలున్నాయి. వీటిలో రెండు వీరగల్లులు కాగా ఒకటి నాగలింగం మరొకటి కాలభైరవ శిల్పాలున్నాయి. రెండు వీరగల్లుల శిల్పాల్లో ఒకటి రాష్ట్రకూటుల కాలానికి చెందినది. ఇది అరుదైన, అద్భుతమైన, నిలువెత్తు వీరగల్లు. వీరుడు సర్వాభరణాలు ధరించి కుడిచేతితో బాణం, ఏడమచేతిలో విల్లు, నడుమున పట్టాకత్తి ధరించి యుద్ధసన్నద్ధుడై ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ వీరుడు అమరుడు అయ్యాడని చెప్పటానికి సూచనగా ఇద్దరు అప్సరాంగనలు వీరుని తలకు ఇరువైపులా నిల్చున్నట్లుగా ఆ శిల ఉంటుంది. రెండో వీరగల్లు కాకతీయశైలిలో చెక్కినట్టుగా తెలుస్తోంది.