07-11-2025 11:53:00 AM
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో దేశభక్తి గేయాలాపన
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో వందేమాతరం(Vande Mataram ) గేయం 150వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పాఠశాలల్లో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు సమూహంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఉదయం జాతీయ పతాకావిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం దేశభక్తి నినాదాలతో విద్యార్థులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి రగిలించిందని పలువురు ఉపన్యాసకులు పేర్కొన్నారు.