స్టార్ హాస్పిటల్‌కు ఏహెచ్‌పీఏ లీడర్‌షిప్ అవార్డు
క్వాలిటీ, సెఫ్టీ విభాగంలో జాతీయ గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్టార్ హాస్పిటల్‌కు జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. వైద్యరంగంలో నాయకత్వ పురస్కారంగా భావించే అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండి యా (ఏహెచ్‌పీఐ) లీడర్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంగా స్టార్ హాస్పిటల్ విజేతగా నిలిచింది.
హైదరాబాద్‌లోని బం జారాహిల్స్‌లో ఉన్న తాజ్‌డెక్కన్ హోటల్‌లో జరిగిన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్ సీఈవో డాక్టర్ రాహుల్ మెడక్కర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఈ ఏడాదే ప్రారంభించారు. భారత్‌లోని 20 వేల ఆసుపత్రుల్లో రోగికి అందుతున్న నాణ్యమైన వైద్య సేవలు, రోగి కేంద్రిత సేవలు, సిబ్బంది భాగస్వామ్యం, సామాజిక ప్రభావం వంటి రంగాల్లో అద్భు త ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.
నాణ్యమైన, అత్యున్నతమైన వైద్య సేవలు అందిస్తున్న స్టార్ హాస్పిటల్స్ ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. ఏహెచ్‌పీఐ నిపుణుల బృందం స్టార్ హాస్పిటల్స్‌ను సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలను క్షుణ్నంగా పరిశీలిచాకే, ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సీఈ వో డాక్టర్ రాహుల్ మెడక్కర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో స్టార్ హాస్పిట ల్స్ గుర్తింపు గర్వకారణంగా ఉందన్నారు.
తమ హాస్పిటల్ చేరే రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించడం వల్లే ఈ పురస్కారం లభించిందని పున రుద్ఘాటించారు. ఈ అవార్డు రావడంతో సిబ్బంది కృషి ఉందని అభినందించారు. భవిష్యత్తులోనూ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.






