20-09-2025 12:51:38 AM
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీ కాబట్టే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించాడని వేములవాడ లో బీసీ సంఘాలు ధ్వజమెత్తారు. రెండు రోజుల్లో బదిలీ చేయకుంటే బీసీ సంఘాల జేఏసీ ఐక్య కార్యాచరణ ప్రకటించారు. మొదట చలో సిరిసిల్ల, ఆ తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ బాధితులనంతా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి కి పిర్యాదు చేశారు. ఏది ఏమైనా కలెక్టర్ ను బదిలీ చేసే వరకు నిరసన కార్యక్రమాలు జరుపుతామని పలు సంఘాల నాయకులు తెలిపారు.