20-09-2025 12:49:59 AM
కరీంనగర్, సెప్టెంబర్19(విజయక్రాంతి): కరింనగర్ జిల్లా లో 44 వేల 885 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. 5 లక్షల 38 వేల 620 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశారు. జిల్లాలోని కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గోపాలరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని 15 జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చెసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలుపై రైతులకు అవగాహన నప్రారంబించారు.
పత్తి కొనుగోళ్లకు రైతుల ఆధార్ ప్రమాణికమని, రైతులందరు తమ బ్యాంక్‌ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం, కపాస్ కిసాన్ ఆప్ లో నమోదు చేసుకునే విధంగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తునన్నారు. జిన్నింగ్ మిల్లులలో మరమ్మతులు పూర్తి చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అతిపెద్ద పత్తి మార్కెట్ జమ్మికుంట లో ప్రస్తుతం కొత్త పత్తి విక్రయాలు ప్రారంభించారు క్వింటాలు కు రూ. 6,811 నుంచి రూ. 5,011 వరకు పలికింది. అలాగే పాత విడి పత్తిని.. రూ. 7,450 గా ఉంది. రేట్లు మార్కెట్ డిమాండ్ ను బట్టి పెరుగనుంది.
పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
పత్తి సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇందుకోసం మార్కెటింగ్ అధికారులను ఆదేశించాం. పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించాం. రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తుంది.