నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మహిళ రక్షణలపై రాష్ట్ర ఈగల్ పోలీస్ అవగాహన సదస్సు
ఈగల్ పోలీస్ విభాగం ఎస్పీ పి సీతారాం
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,కళాశాల ఘన్ పూర్ లో నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ,మహిళా రక్షణ లపై తెలంగాణ రాష్ట్ర ఈగల్ పోలీస్ విభాగం ఎస్పి పి సీతారాం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల క్రయ విక్రయాలు వినియోగాన్ని నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ పోలీస్ విభాగం బుధవారం మెడిసిటీ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్ పూర్ కళాశాల ఆవరణలో మెడికల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఎస్పి సీతారాం పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈగల్ పోలీస్ విభాగం నేతృత్వంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె సైదులు, ఈగల్ పోలీస్ విభాగం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి శ్రీనివాసరావు లు నార్కోటిక్స్ సైబర్ సెక్యూరిటీ మహిళ రక్షణ అనే అంశాలపై కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలను వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు.అదేవిధంగా ముందుగా డ్రగ్స్ వలన కలిగే దుష్ఫలితాలు వాటికి బానిసలు కావడంతో ఏర్పడే ఇబ్బందులను తెలియజేస్తూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకొని నార్కోటిక్స్ వినియోగమే కాకుండా వాటిని విక్రయించే వారికి దూరంగా ఉండాలని వారు సూచించారు.
ఒకవేళ ఎవరైనా వీటితో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పి సీతారాం హెచ్చరించారు.అలాగే నానాటికి పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల సరైన అవగాహన పెంపొందించుకోవాలని సూచిస్తూ మెడికల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగి ఉండడం వలన వీటి బారిన పడకుండా ఉంటామని విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల ఎన్నో చర్యలు తీసుకుంటుందని విద్యార్థినిలు కూడా తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే పోలీస్ శాఖను సంప్రదించాలని సీతారాం విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మెడిసిటి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి.డాక్టర్ శైలేంద్ర తో పాటు కళాశాల చెందిన అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






