23-05-2025 08:42:28 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన్ ఆఫీసులో లారీ డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ ఆదేశాల మేరకు, కొత్తగూడెం డిఎస్పీ, కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన్ ఆఫీస్ లో లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు డ్రైవర్లు,రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలను నడపకూడదని తెలిపారు. నిద్రలేమితో వాహనాలను నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు తమ వాహనాల ఇంజన్లు, టైర్లు చెక్ చేసుకోవాలన్నా రు. సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని సూచించారు. మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రమాదం జరిగితే వ్యక్తులను,వాహనాలను చట్ట ప్రకారం కోర్టుకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,2టౌన్ ఎస్సై కిషోర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.