23-05-2025 08:31:56 PM
ఐటిడి పిఓ రాహుల్
భద్రాచలం,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ( బాలురు) కిన్నెరసాని నందు ఆర్చరీ కోచ్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలికలు) కాచన పల్లి నందు కబడ్డీ కోచులుగా అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా పనిచేయడానికి ఒక సంవత్సరం ఎన్ఎస్, ఎన్ఐఎస్ డిప్లోమా సంబంధిత క్రీడల నందు అర్హులైన అభ్యర్థిని, అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుచున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ఆసక్తి, అర్హత కలిగిన వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను (రెజ్యూమె) తగు ధ్రువ పత్రములు జతపరిచి స్పోర్ట్స్ ఆఫీసర్ ఐటీడీఏ ప్రాంగణంలోని పి ఎమ్ ఆర్ సి కార్యాలయము నందు వ్యక్తిగతంగా సమర్పించగలరని లేదా dtdo.bhadradri@gmail.com కు ఈ మెయిల్ ద్వారా పంపవచ్చు అన్నారు. ఇట్టి దరఖాస్తులను ఈనెల 26వ తేదీ నుండి వచ్చే నెల జూన్ 03వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు స్వీకరించబడునని ఆయన తెలుపుతూ, పూర్తి వివరాల కోసం 9848988205, 9912362053 ఫోన్ నెంబర్లకు కార్యాలయం పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.