calender_icon.png 21 September, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలిదండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

21-09-2025 08:12:41 PM

కబడ్డీ పోటీల కరపత్రాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గరిడేపల్లి (విజయక్రాంతి): దసరా పండుగ సందర్బంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 24 నుంచి 30 వరకు వెలిదండ జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పోటీల ప్రారంభోత్సవానికి నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆదివారం మంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ పోటీలకు ఎంట్రీ ఫీజు రూ.500గా నిర్ణయించారు. ప్రథమ బహుమతి రూ.25,000, ద్వితీయ బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.15,000, నాలుగో బహుమతి రూ.10,000గా ప్రకటించారు.కబడ్డీతో పాటు పురుషుల టగ్ ఆఫ్ వార్, గ్రామస్థాయి మహిళా కబడ్డీ,మహిళల తాడు లాగుట,బతుకమ్మ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281111757, 9951320946, 9505579593 నెంబర్లను సంప్రదించాలని కోరారు.