14 August, 2026 | 4:10 AM

సెప్టెంబర్‌లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు

14-08-2026 12:00 AM

తెలంగాణ యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్ రెడ్డి 

ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి తెలిపారు. గురువారం ఎల్.బి. స్టేడియంలోని ఓలింపిక్ భవన్ లో నిర్వహించిన అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో పోటీల నిర్వహణపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సబ్జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల జిల్లా స్థాయి యోగా పోటీలను ఈ నెలలోగా పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులకు సూచించారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర జట్టుకు పంపేందుకు ఎంట్రీలను వెం టనే పంపాలని కోరారు. రాష్ట్రంలో జరగను న్న ఖేలో ఇండియా జాతీయ యోగా పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని ఎస్.ఎన్. రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డితో పాటు వివిధ జిల్లాల అ ధ్యక్షులు, కార్యదర్శులు కమలాకర్, రవీంద ర్, ఉప్పల శ్రీనివాస్, కిషన్ నాయక్, రామకృష్ణ, ఉప్పు రవీందర్, అశోక్, అనూష, ము రళి, అనిల్, వరుణ్, సాయినాథ్, రాజశేఖర్, సమ్మయ్య, మహేందర్, సురేష్, ప్రభాకర్ రెడ్డి, సుసియా తదితరులు పాల్గొన్నారు.