విద్యార్థులతో తిరంగా యాత్ర
14-08-2026 12:00 AM
మాజీ కార్పొరేటర్ పావని
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం తిరంగా యాత్ర నిర్వహించారు. అభ్యుదయ హైస్కూల్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన ఈ యాత్రలో గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులే భవిష్యత్ భారతదేశానికి పునాది అని అన్నారు. తిరంగా యాత్రలో పాల్గొనడం ద్వారా సైనికులు, రైతులు, శాస్త్రవేత్తలకు గౌరవం తెలిపినట్లవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు.






