అత్యాధునిక రెటినా సర్జికల్ సెంటర్
సికింద్రాబాద్‌లో ప్రారంభించిన లయన్స్ రోటరీ క్లబ్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : సికింద్రాబాద్‌లోని లయన్స్ దుండూ ఐ ఇనిస్టిట్యూట్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డి స్ట్రిక్ట్ మొయినాబాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో లయన్స్‌రోటరీ రెటినా సర్జి కల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని టిబ్రేవాలా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రీమియర్ ఎనర్జీస్ సీఎస్‌ఆర్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 (202526) డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటేరియన్ డా. ఎస్. వి. రాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ హర్జీత్ సింగ్, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ అధ్యక్షుడు రోటేరియన్ రాజశేఖర్ వొడెల, టిబ్రేవాలా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ జ్యోతి ప్రకాశ్ టిబ్రేవాలా, నెక్స్టె్జన్ సేల్స్ అండ్ మా ర్కెటింగ్ హెడ్ ఈషా టిబ్రేవాలా, కిమాయా వర్మా పాల్గొని ప్రసంగించారు. ఈ కేంద్రం ద్వారా రెటినా వ్యాధుల నిర్ధారణ, విట్రియో-రెటినా శస్త్రచికిత్సలు, అత్యాధునిక నేత్ర వైద్య సేవలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో అందించ నున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపులో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు లయన్ ఆర్తి గోయల్, ట్రస్ట్ కార్యదర్శి అనితాజీ అగ ర్వాల్ ధన్యవాదాలు తెలిపారు.






