07-11-2025 01:03:45 AM
- అగ్నిమాపక కేంద్రంలో సమస్యల ఫైర్
- సేవలు అత్యవసరం..సౌకర్యాలు అధమం
- ఏళ్లుగా రేకుల షెడ్డులోనే ఫైర్ స్టేషన్ నిర్వహణ
- కార్యాలయానికి సొంత భవనం కరువు
- బిక్కుబిక్కుమంటు సిబ్బంది విధులు
- హామీలకే పరిమితమవుతున్న పక్కా భవన నిర్మాణం
- పాలకులు మారిన సమస్యల గోడు వినరే..
- ఆపద శాఖకు తప్పని సమస్యల కష్టాలు
మణుగూరు, నవంబర్ 6 (విజయ క్రాం తి) :ఆపదలో ఆదుకోవాల్సిన అగ్నిమాపక కేంద్రాలు సమస్యలలో కొట్టుమిట్టాడు తు న్నాయి. ఎటు వంటి విపత్తుఎదురైనా ముం దు గుర్తొచ్చేది అగ్నిమాపక శాఖ సిబ్బందే. ఎక్కడ, ఎటువంటి ఘటన జరిగినా మేమున్నామంటూ ముందు కొచ్చి ప్రజల ప్రాణ, ఆస్తిన ష్టాలను కాపాడటంలో ముందుండేది వాళ్లే. అంతటి ప్రాధాన్యత ఉన్న వారు సమస్యల నడుమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మణుగూరు అగ్నిమాపక కేంద్రంలో అధికారులు, సిబ్బంది అసౌకర్యాల మధ్యే విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్లుగా శిథిలావస్థకు చేరిన రేకులషెడ్ లోనే అగ్నిమాపక కార్యాలయం కొనసాగుతోంది. అగ్నిమాపక కేంద్రానికి శాశ్వత భవన నిర్మాణం కోసం పాలకులు ప్రతి పాదనలు చేసినా నేటికీ మోక్షం కలగలేదు. ఆపద శాఖకు కష్టాలు తప్పడం లేదు. దీనిపై విజయక్రాంతి కథనం..
ఆరపండి సమస్యల మంటలు..
ఆపదలో అగ్నిని చల్లారిసి ప్రమాదాల బారినుండి ప్రజలను కాపాడే అగ్నిమాపక శాఖకు మణుగూరు మండల కేంద్రంలో బురద కష్టాలు ఎదురవుతు,సమస్యల కడగండ్లు వెంటాడుతు న్నాయి. పట్టణంలో ని శ్రీశ్రీనగర్ లో 2008లో నాటి బూర్గంపాడు, నేటి పినపాక ఎంఎల్‌ఎ పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అగ్నిమాపక కేంద్రం ప్రారంభమైంది. నాటి నుండి నేటి వరకు ఫైర్ స్టేషన్ కు సరైన భవనం లేక దా తల సహకారంతో నిర్మించిన రేకుల షెడ్డులోనే అగ్నిమాపక శకటాలతో సిబ్బంది విధు లు నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందుల గురవుతున్నారు. పక్కభవనం లేక రేకుల షెడ్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. దీనికి తోడు చిన్న పాటి వర్షాలకు ఫైర్ స్టేష న్ ఆవరణ మొత్తం మోకాలిలోతు నీళ్లతో దర్శనమిస్తుంది. రోడ్లన్నీబురదమయం కావడంతో ఫైర్ వాహనం ఒక్క అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది.
సమస్యల ఫైర్..
అగ్నిమాపక కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కా భవనము మం జూరు చేయలేదు. అలాగే ప్రధానంగా అగ్నిమాపక కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఫైరింజనకు నీటి వసతి కూడా కల్పించలేదు. ఫైరింజనకు నీరు నింపాలంటే సిబ్బంది చెరువులు, కుంటలు, కొలను, ప్రైవేటు, రైతు బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఫైరింజనకు నీటి వసతి లేక అగ్నిమాపక సిబ్బంది పడుతున్న కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ఫైరింజనకు నీళ్లు నింపేందుకు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు కార్యాలయం చుట్టూ ప్రహరీ లేకపోవడం తో ఆవరణలో పశువులు, పందు లుసంచరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన గది లోనే సిబ్బంది ఉండాల్సి వస్తోంది.
సమస్యల కష్టాలు..
ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే, అక్కడికి అత్యంత వేగంగా చేరుకొని, సహాయక చర్యలు చేపట్టగలిగితేనే ప్రమా ద తీవ్ర త, నష్టాన్ని తగ్గించవచ్చు. అదే ఘటనా స్థలానికి చేరుకోవడం లోనే ఆలస్యమైతే ప్రమాద తీవ్రత మరింత పెరిగి నష్టమూ అధికమవుతుంది. అగ్నిమాపక కేంద్రానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, ఒకెత్తయితే విద్యుత్, కేబుల్ తీగలు, కారణంగా వాహనం రాకపోకలకు అలస్యం అవుతోందని, తీవ్ర ఇబ్బందిగా ఉందని సిబ్బంది పే ర్కొంటున్నారు.
పారిశ్రామిక కేంద్రంగా ఉన్న మణుగూరు ఏరియాలో అగ్ని ప్రమాదాలు సంభవిం చినప్పుడు సత్వరమే వెళ్లడం చాలా ముఖ్యమని, లేకుంటే నష్టం పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఏదైనా ప్రమాదం జరిగి, ఫోన్ చేస్తే సిబ్బంది. గంట కొట్టుకుంటూ వచ్చే వరకు పుణ్య కాలంకాస్తా పూర్తవుతుంది. అగ్నికి ఆస్తి ఆహుతి అవుతోంది. బాధితులకు బూడిదే మిగు లు తోంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి. పారిశ్రామికం గా కీలకమైన ఈ ప్రాంతంలో అగ్ని మాపక కేంద్రం పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని, సమస్యలను పరిష్క రించడంతో పాటు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చే యాలని ప్రజలు కోరుతున్నారు.
పాలకులు మారిన పట్టించుకోని ..
ఫైర్ స్టేషన్ పట్టణంలో అనుకూల మైన స్థలంతో పాటు, శాశ్విత భవనం కోసం ని ధులు మంజూరు చేయాలని అటు ఫైర్ అధికారులు, ఇటు ప్రజలు ఏళ్ల తరబడి కోరుతు న్నా నాయకులు ఇస్తున్నహామీలు ఉత్తవిగా మిగిలాయి. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న అగ్నిమాపక భవనానికి మాత్రం మో క్షం లభించడం లేదు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్పం దించి ప్రత్యేక చొరవ తీసుకొని అగ్ని మాపక కేంద్రానికి పక్కా భవనం మంజూరు చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.