26 August, 2026 | 8:27 AM

కవయిత్రీ మొల్ల విగ్రహావిష్కరణ

14-03-2025 01:50 AM

నల్లగొండ, మార్చి 13 (విజయక్రాంతి) : తొలి కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆమె విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.

రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని కొనియాడారు. అనంతరం శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు సలికంటి రాములు మాట్లాడుతూ.. ఆరు ఖండాలు,  871 పద్యాలతో రామాయణాన్ని ఐదు రోజుల్లో రచించిన విజ్ఞాని మొల్ల అన్నిపేర్కొన్నారు. 

2017లోనే కేంద్రం ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించి గౌరవించిందని గుర్తు చేశారు. కవయిత్రి  మొల్ల సమాజ శ్రేయస్సుకు ఎంతగానో పాటుపడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలోనాదెండ్ల అయ్యన్న, మల్లికంటి అంజయ్య, ఐఎస్టీయూసీ నాయకుడు అంబటి సోమయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.