calender_icon.png 3 May, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశలవారీగా చెప్పాలి

03-05-2025 01:35:30 AM

  1. కులగణన వివరాలను కేంద్రం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి
  2. తెలంగాణ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలి 
  3. రేవంత్‌రెడ్డిని అభినందించిన సీడబ్ల్యూసీ
  4. కులగణన తెలంగాణకే గర్వకారణమన్న సీఎం రేవంత్ 
  5. రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం

న్యూఢిల్లీ, మే 2: ‘కులగణనకు సంబంధించి ప్రతీ దశను స్పష్టంగా చెప్పాలి. ఏది ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టమైన కాలక్రమం ప్రకటించాలి. 11 సంవత్సరాల కాంగ్రెస్ పోరాటానికి మోదీ ప్రభుత్వం తలవంచింది.’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశ మైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

‘దేశం మొత్తం జవా బుదారీతనం, జవాబుల కోసం ఎదురుచూస్తోంది. పహల్గాం పిరికిదాడి వెనుక ఉన్న వారు తీవ్రంగా శిక్షించబడాలి. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో విపక్షాలన్నీ కేంద్రానికి మద్దతుగా ఉంటాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉంటాం’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పైకి ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు తప్పక శిక్ష విధించాలని కమిటీ ప్ర భుత్వాన్ని కోరింది. ‘ఈ సమయంలో మనం ఎటువంటి భేదాలు లేకుండా ఐక్యంగా ఉం డాలి.’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది. 

తెలంగాణ మోడల్ అనుసరించాలి

కులగణనకు తెలంగాణ మోడల్‌ను పరిగణలోకి తీసుకోవాలని సీడబ్ల్యూసీ తీర్మా నం చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని,  ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అభినం దించారు. తెలంగాణలో లక్షమందికి పైగా ఎమ్యునరేటర్లతో కులగణన చేసినట్టు, ఒక్కో ఎమ్యునరేటర్‌కు 150 ఇళ్లను అప్పజెప్పి.. రోజుకు 10 ఇళ్ల చొప్పున శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా సర్వే నిర్వహించినట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సీడబ్ల్యూసీలో తీర్మానం చేయడం.. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని.. ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విష యంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం ఎంతో గర్వంగా ఉంది’ అని  సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌వేదికగా ట్వీట్  చేశారు. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన తీర్మానాలు

* జనాభా లెక్కల్లో భాగంగా కులాల వారీగా జనాభా డేటాను సేకరించాలని కాంగ్రెస్ 11 సంవత్సరాల నుంచి డిమాం డ్ చేస్తోంది. చివరకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. అయితే కులగణనపై కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌పై ప్రధాని మోదీ ఎదురుదాడి చేశారు. అయితే కుల గణనపై నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుందో పూర్తి వివరాలు వెల్లడించలేదు.. అందు కు సంబంధించిన నిధులు కూడా కేటాయించలేదు.  

* ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏప్రిల్ 16, 2023న కులగణనకు డి మాండ్ చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు.  సమగ్ర కులగణన చేయాలని కోరడంతో పాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. 

* దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని  రాహుల్ గాంధీ కూడా బలమైన వాదన వినిపిస్తున్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన 2022 నవ సంకల్ప్ శిబిరంలో, ప్రభుత్వ విధానాలు అణగారిన వర్గాల జీవిత వాస్తవాలను  ప్రతిబింబించేలా కులంపై డేటాను సేకరించాల్సిన తక్షణ అవసరాన్ని రాహుల్‌గాంధీ లేవనెత్తారు.  ఈ డిమాండ్ 2023లో రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలోనూ  పునరుద్ఘాటిం చబడింది.  2019,  2024 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలలోనూ కులగణన అంశాన్ని కాంగ్రెస్ చేర్చింది. రెండు సార్లు చేపట్టిన భారత్ జోడో యాత్రల సమయంలోనూ కులగణన అవసరమని రా హుల్‌గాంధీ  స్పష్టం చేశారు.  రిజర్వేషన్, సంక్షేమం, కాలం చెల్లిన అంచనాలు లేదా ఏకపక్ష పరిమితులపై ఆధారపడి ఉండవని, వాస్తవా లపై ఆధారపడి ఉండాలని రాహుల్‌గాంధీ చెప్పారు. 

* ప్రైవేట్ విద్యా సంస్థలలో ఓబీసీలు,  దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు కల్పించ డానికి వీలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5)ని తక్షణమే అమలు చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఉన్నత విద్యలో ప్రైవేట్ సంస్థలు ఆధిపత్య పాత్ర పోషిస్తున్న ఈ యుగంలో, ఈ ప్రదేశాల నుంచి అణగారిన వర్గాలను మినహాయించడం అసమానతను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆర్టికల్ 15(5) కేవలం రాజ్యాంగ నిబంధన మాత్రమే కాదు, ఇది తప్పనిసరి సామాజిక న్యాయం. ప్రభుత్వ,  ప్రైవేట్ సంస్థల లో ఓబీసీలు, ఈబీసీలు,  దళితులు, ఆదివాసీలకు నాణ్యమైన విద్యను అందు బాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ గట్టిగా విశ్వసిస్తుంది.

* తెలంగాణ అనుసరించిన నమూనా భారత ప్రభుత్వం అనుకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో, కుల సర్వే రూపకల్పన పౌర సమాజం, సామాజిక శాస్త్రవేత్తలు,  సమాజ నాయకుల చురుకైన ప్రమేయం, సంప్రదింపులతో పారదర్శక ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేయబడింది. 

* నాలుగు గోడల మధ్య సమావేశంలా కాకుండా, ప్రజల నుంచి సేకరించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా కులగణనను పూర్తి చేయాలి. విశ్వసనీయమైన, శాస్త్రీయమైన,  భాగస్వామ్య నమూనాను రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందిస్తోంది. సంప్రదింపులు, జవాబుదారీతనం, సమగ్రత విలువలను ప్రతిబింబించే చట్టాన్ని రూపొందించడంలో  సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. 

* కులగణన ప్రకియను ఆలస్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీల నిర్ణయా లను పరిగణలోకి తీసుకోవాలి. ఈ అం శంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి. ప్ర భుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు స్పష్టమైన కాలక్రమాన్ని ప్రకటించాలి. 

# కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణ యం దేశంలో సామాజిక న్యాయానికి మొదటి అడుగు. కానీ కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన సమయమే కాస్త అనుమానంగా ఉంది.పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు నేను అండగా ఉంటా. పహల్గాం బాధితులకు అమరవీరుల హోదా ఇవ్వాలి. 

 రాహుల్ గాంధీ, 

లోక్‌సభ ప్రతిపక్ష నేత