calender_icon.png 4 May, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాలలో విద్యార్థుల నమోదుకు కృషి చేయాలి

03-05-2025 02:57:15 PM

నడిగూడెం,(విజయక్రాంతి): కేఎల్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సౌకర్యాలు విద్యావకాశాలను గ్రామాలలో ప్రచారం చేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థుల నమోదుకు ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ డి. విజయ నాయక్ కోరారు. శనివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన అధ్యాపకుల సమావేశంలో ఆయన  పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది ఇంటర్లో నడిగూడెం కళాశాల జిల్లాలోనే ఇంటర్ ఫలితాల్లోమొదటి స్థానం  సాధించిందని, ఈ వివరాలను 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు తెలియపరుస్తూ కళాశాలలో చేరేలా వారిని ప్రోత్సహించాలన్నారు. కళాశాలలో నాలుగు సాధారణ గ్రూపులతో పాటు ఆరు వృత్తివిద్యా కోర్సులలో విద్యార్థుల నమోదుకు దరఖాస్తులను కోరుతున్నట్లు తెలిపారు. అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కళాశాల ఆవరణలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని 100% శాతం ఫలితాలు సాధించాలని కోరారు. సమావేశంలో అధ్యాపకులు జాన్ పాషా ,శ్రీధర్, మహేష్  కృష్ణ, నాగరాజు, ఉపేందర్, వెంకటేశ్వరరావు, మదారు ఈశ్వర్ ,ధనుంజయ్ ,మనీ శైలజ, రవి వర్మ పాల్గొన్నారు.