calender_icon.png 4 May, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీల పనిదినాలు పెంచాలి, బకాయిలు చెల్లించాలి

03-05-2025 01:39:54 PM

రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయి

విషయం తెలిసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారు

హైదరాబాద్: ఉపాధిహామీ పనిదినాలు 12.22 కోట్లు నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు(Thanneeru Harish Rao) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) 42 సార్లు ఢిల్లీ వెళ్లినా ఉపాధి పనిదినాలు సగం తగ్గాయని హరీశ్ రావు ఆరోపించారు. విషయం తెలిసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఉపాధిహామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే ఉపాధి కూలీల పనిదినాలు పెంచాలి, బకాయిలు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.