calender_icon.png 4 May, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మైనారిటీ నేత వినూత్న ఆందోళన

03-05-2025 02:52:40 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి గౌస్ ఆందోళన పట్టణంలో చర్చనీయాంశoగా మారింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య తనపై అక్రమంగా కేసు పెట్టించారoటూ అదే పార్టీకి చెందిన మైనార్టీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండి గౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎండి గౌస్ తనపై కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పత్రంతో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనకి దిగడం కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. స్థానిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో కీలక భూమిక పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిపై మైనార్టీ కాంగ్రెస్ నేత ఆందోళనకి దిగడం పట్టణ కాంగ్రెస్ శ్రేణుల్లో దుమారం లేపింది.

తనపై కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అక్రమంగా తప్పుడు కేసు పెట్టించారని, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి గౌస్ ఆరోపించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఫ్లెక్సీ టౌన్ కాంగ్రెస్ కార్యాలయం లో ఉండగా కొద్ది రోజుల క్రితం  ఫ్లెక్షీ ని తొలగించారన్నారు. ఈ విషయం పై తాను  కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య ను అడి అడిగినట్లు గౌస్  తెలిపారు. ఈ విషయం పై మల్లయ్య ఇష్టం వచ్చినట్లు తననను దూషించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్యే ను,పార్టీ ని దూషించినట్లు మల్లయ్య బెల్లంపల్లి వన్  టౌన్ పోలిస్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆయన తెలిపారు. తనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టించిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని, ఈ విషయమై పార్టీఅధిష్టానం తక్షణ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తనపై పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పుడు కేసు పెట్టించినందుకు మల్లయ్య పై అధిష్టానం క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరారు.