calender_icon.png 4 May, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

03-05-2025 01:42:10 PM

మందమర్రి,విజయక్రాంతి: తెలంగాణ మోడల్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ మీడియట్(intermediate)లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ కోరారు. ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం లో ప్రవేశం కోసం 10 వ తరగతి  ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. ఎంపీసీ, బిపిసి, సిఈసి, ఎంఈసి లలో ప్రతి గ్రూప్ లో 40 సీట్లు ఉన్నాయని, దరఖా స్తు చేసుకున్న విద్యార్థులకు వచ్చిన మెరిట్ ఆధారంగా ఆయా గ్రూప్ లలో సీట్లు కేటాయించడం జరుగుతుంద న్నారు. ఎలాంటి ఫీజు లేకుండా  http://183.82.97.97/mstg ద్వారా ఆన్లైన్ లో ఈ నెల 5 నుండి 20 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవా లని, ఎంపికైన విద్యార్థుల జాబితా ఈ నెల 26 న కాలేజీ లో అందుబాటులో ఉంటుంద ని తెలిపారు. బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి  ఉందని ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.