15-09-2025 12:00:00 AM
నకిరేకల్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): కల్లుగీత వృత్తిలో ఉపాధి ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట నిర్వహించిన మండల 3 వ మహాసభలో మాట్లాడారు. రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై 5 లక్షల కుటుంబాల ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 5 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మహాసభలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాని బోల్ల గాని జయరాములు,రాష్ట్ర నాయకులు రాగిరి కృష్ణయ్య, గాజుల ఆంజనేయులు, బావుండ్లపల్లి బాలరాజు, ఎర్ర రవీందర్, కు నురు మల్లేశం, ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయి, మునుకుంట్ల లెనిన్, తాళ్లపల్లిజితేందర్, తూర్పునూరు శ్రీనివాస్, బైరు రామకృష్ణ ,ఆకిటి శ్రీను, పబ్బతి జాంగిర్, గంగదేవి అంజయ్య, పబ్బతి అంజనేయులు, కొమ్మగోని అశోక్ గౌడ్, పలసం కనకయ్య, ఎర్ర కాటమయ్య ,తాటిపాముల నవీన్, అంతటి దశరథ, లగ్గొని యాదయ్య, ఎర్ర వెంకటేశం, బైరు శంకరయ్య, పందుల శ్రీను, తాటిపాముల లింగయ్య, గంగాదేవి జమ్మయ్య గంగాదేవి అంజయ్య గంగాపురం కాటమయ్య బొడిగె ఆంజనేయులు గుండాల యాదయ్య తాళ్లపల్లి దుర్గయ్య కంభంపాటి శ్రీకాంత్ కప్పల రాజయ్య కొన్ని అశోకు పలసం కిష్టయ్య కొన్ని అంజయ్య, గడ్డమీది సత్తయ్యనాతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.