calender_icon.png 15 September, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు నల్లగొండ జిల్లాకు గవర్నర్

15-09-2025 12:00:00 AM

నల్లగొండటౌన్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం నల్లగొండ జిల్లాలో  పర్యటించనున్నారు. నార్కట్ పల్లి మండలంలోని  మహాత్మా గాంధీ విశ్వవిద్యాల య నాల్గవ స్నాతకోత్సవానికి ఉదయం 11 గంటలకు  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 22 మంది పి హెచ్ డి సాధించిన విద్యార్థులు, 57 మంది గోల్ మెడల్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేస్తారు. ఎంజి యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పా టు చేశారు.

గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే సోమవారం లోపలికి అనుమతిస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఆదిత్య భవనంలో అధికారులతో జరిగే రివ్యూ సమావేశంలో పాల్గొంటారు. గవర్నర్ నల్లగొం డకు మొదటిసారి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.