calender_icon.png 15 September, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవిద్యార్థులకు స్కాలర్‌షిప్పుల పంపిణీ

15-09-2025 12:00:00 AM

అవోపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ 

కోదాడ సెప్టెంబర్ 14 : కోదాడ ఆవోప చేస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు పేర్కొన్నారు. అవోపా కోదాడ 21వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక గుడి గుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన సభా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఆర్యవైశ్య అఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా పట్టణానికి చెందిన ఇమ్మడి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా కోదాడ పట్టణ అవోపా అధ్యక్షునిగా కందిబండ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. జిల్లా ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు గరినే ఉమామహేశ్వరి శ్రీధర్, కోదాడ అవపా వ్యవస్థాపకులు గోళ్ళ చంద్రయ్య, అవోపా రాష్ట్ర బాధ్యులు కట్టా రవికుమార్, రఘు వంశీ,  ఇరుకుల్ల చెన్నకేశవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిబండ వెంకటేశ్వరరావు, చారుగుండ్ల రాజశేఖర్, మా శెట్టి అనంత రాములు, పోతుగంటి అభిరాం, పైడిమర్రి నారాయణరావు, తూములూరి జనార్ధన్, ఓరుగంటి శ్రీనివాసరావు, కొండ్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.