17 April, 2026 | 8:50 PM

కాలనీలలో సమస్యల పరిష్కారానికి చర్యలు

09-06-2025 02:01 AM

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మేడ్చల్, జూన్ 8 (విజయ క్రాంతి): కాలనీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసు కుంటాన ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం యాప్రాల్ లోని సాయి కృష్ణ ఎంక్లేవ్ 1,2 కాలనీలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.

అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలం ఇబ్బంది అవుతోందని ప్రజలు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. 

ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు 

మౌలాలి జవహర్ నగర్ లో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.