30 July, 2026 | 5:47 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

యునెస్కో గుర్తింపునకు చర్యలు

16-02-2026 12:00 AM

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 15: పానగల్ చాయా సోమేశ్వరాలయానికి కేంద్ర ప్రభుత్వం యునెస్కో గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల, ఛాయా సోమేశ్వరాలయాలలో అయన ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు వందల ఏళ్ల చరిత్ర గలిగిన చారిత్రాత్మకత కలిగిన ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాలకు యునెస్కో గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలిని కోరారు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఈ ఆలయాలను సందర్శించి వందల ఏళ్ల చరిత్రను తెలుసుకుంటున్నారని తెలిపారు. 11-12వ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాలలో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుంది అని తెలిపారు.

ఛాయా సోమేశ్వరాలయం గర్భగుడిలో ఎప్పుడు ఒకేలా నీడ నిచ్చలంగా ఉండడం ఇక్కడ ఒక అద్భుతం అన్నారు మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ కార్పొరేషన్ గెలిపించి ప్రజలు గిఫ్టుగా ఇచ్చారు అని.మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం జరుగుతుంది వివరించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆబ్బ గోని రమేష్ గౌడ్, అళ్లీ సుభాష్ యాదవ్, ఆలకుంట్ల నాగరత్నం రాజు తదితరులు ఉన్నారు.