10 May, 2026 | 6:23 AM

మల్లెమొగ్గల గొడుగు

13-05-2024 12:05 AM

 మాదిగ కథలు

మన మనసుల్ని కట్టి పడేసి, ఏక బిగిన చదివించే అద్భుతమైన పుస్తకమిది. ఒకవైపు కుల దౌష్ట్యాలనూ, మరోవైపు ఆధునిక సమాజం విసురుతున్న సవాళ్లనూ గుండె ధైర్యంతో ఎదుర్కొంటూనే ఎప్పటికప్పుడు తనను తాను బలంగా పునర్నిర్వచించుకునే కమ్యూనిటీ అనుభవాలను అతి దగ్గరగా చూపించే రచన ఇది. వీరంతా తాము ఎదుర్కొంటున్న అణచివేతను, తమ జీవన పరిస్థితులను.. ఎక్కడా నిరాశకు, ద్వేషభావాలకు తావివ్వకుండా అలవోకగా ప్రతిఫలిస్తారు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థ కారణంగా నిరంతరం దుర్భర హింసనూ, అమానవీయ అనుభవాలనూ ఎదుర్కొంటూ కూడా.. ఇందులో తారసపడే ప్రతి ఒక్కరూ పరిపూర్ణ మానవుల్లా కనిపిస్తారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే, దట్టమైన చీకటి రాత్రి వేళ ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చీకటి అంతటా కనబడుతూనే ఉంటుందిగానీ అది మనల్ని ఏ రకంగానూ భయపెట్టలేదు.