యోగా మాస్టర్ యమున

07-05-2024 12:10:00 AM

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సమాజంలో నిలదొక్కుకోవడం కష్టమైన పని.. సంకల్పముంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. కష్టాన్ని ఇష్టంగా అనుకుంటే లక్ష్యం కూడా అలవోకగా దరిచేరుతుంది. ఈ మధ్య యోగా ఎంత పాపులర్ అయ్యిందో తెలుసు కదా..! అటువంటి యోగాలో నైపుణ్యాన్ని సాధించి.. రాష్ట్ర, జాతీయ వేదికలపై జరిగిన పోటీలలో ఆమె పేరు తెచ్చుకుంది. సవాళ్లను ప్రతిసవాళ్లను ఎదుర్కొంటూ అచంచలమైన ఆత్మవిశ్వాసంతో యోగాలో మేటిగా నిలబడిన మన కరీంనగర్‌కు చెందిన యోగా మాస్టర్ యమున. ఆమె ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

కరీంనగర్‌లోని దుర్సెడ్ గ్రామంలో క్రీడలంటే ఏంటో తెలియని పేద కుటుంబంలో యమున జన్మించింది.  ఆరో తరగతి చదువుతున్న సమయంలో యోగకు ఆకర్షితురాలైన యమున కోచ్ దివిటి సత్యనారాణ శిక్షణలో తక్కువ కాలంలోనే యోగాసనాల ప్రదర్శనలో రాటుదేలి పోటీలపై ధ్యాస నిలిపింది. తొలిసారి నిజామాబాద్‌లో 2002 సంవత్సవరంలో జరిగిన రాష్ట్ర పోటీల్లో ఓటమి ఆమెలో పట్టుదలను పెంచింది. యమున ఆసక్తిని, పట్టుదలను గనునించిన జిల్లా యోగా అసోసియేషన్ ప్రోత్సాహం తో యోగాలో మెరుగైన నైపుణ్యాన్ని సాధించింది. అప్పటి నుంచి పోటీల్లో తిరుగులేని ప్రతిభతో ఆమె  రికార్డులు బ్రేక్ చేసింది. ఆయా యోగా పోటీల లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆమె సాధించిన పతకాలే జిల్లా యోగ క్రీడా రంగానికి ప్రథమం. దీంతో తన ఊరు పేరునే కాదు జిల్లా పేరును కూడా ప్రపంచానికి చాటింది.

యమున తల్లి అయిన బుర్ర సత్తమ్మకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురైన యమున 10 సంవత్సరాలు ఉండగా సత్తమ్మ భర్త కనకయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికే పెద్దకూతురుకి పెళ్లి జరిగింది. చిన్న కూతురుకు చదువుపై శ్రద్ధ ఉండటంతో కూలి పని చేసుకుంటూ యమున ను చదివించింది. యమునకు యోగా కోర్సు ఇష్టం కావడంతో కష్టపడి. అప్పు చేసి చదివించడంతో యమున యోగాలో మాస్టర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసింది. 2003 నుంచి నేటి వరకు పలు రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో అలుపెరగకుండా పాల్గొంటూ పసిడి పతకాలు సాధిస్తూ ఆయా వేదికలపై విజయబావుటా ఎగురవేస్తుంది. 

తనకు ఇష్టమైన రంగంలో రాణించి జిల్లాకు ఖండాంతర ఖ్యాతిని తేవా లన్న ఆమె ఆసక్తిని ఆర్థిక పరిస్థితులు నీరుగార్చినా, మొక్కవోని ఆత్మ విశ్వా సంతో యమున అనుకున్నది సాధించింది. లాస్ ఏంజిల్స్‌లో జరుగనున్న అండర్ 18 అంతర్జా తీయ స్థాయి యోగా ఛాంపియన్ షిప్ పోటీలకు ఆమె ఎంపిక అయ్యింది. అయితే ఇంతకు ముందు ఓ సారి 2008లో అమెరి కాలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీలకు మన దేశం నుంచి ఎంపికైయ్యింది. దురదృష్టవశాత్తు వీసా లభించని కారణంగా వెల్లలేక పోయింది. సమస్యను చూసి నిరాశ చెందకుండా, వెనుకడుగు వేయకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే మరో అవకాశం కోసం తీవ్రంగా శ్రమించి, తన యోగా ప్రదర్శనలతో ఔరా అనిపించింది. కేవలం చైనాలోనే కాకుండా పలు దేశాలలో శిక్షణ ఇచ్చిన యమున. ప్రస్తుతం హైదరాబాద్ బంజారా హిల్స్‌లో యోగా సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఆసక్తి గల వారికి శిక్షణ ఇస్తున్న ది. సెలబ్రెటీలు, సినీ తారలు, క్రీడాకారులు యమున వద్ద యోగా నేర్చుకునేం దుకు క్యూ కడుతుంటారు.

 విజయసింహారావు, కరీంనగర్