6 May, 2026 | 2:36 AM

ట్యాంకర్ కావాలంటే.. బిల్లు నంబర్ చెప్పాల్సిందే

27-04-2024 01:09 AM

ఎంసీసీ ప్రతినిధుల వింతచేష్టలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రి ల్ 26 (విజయక్రాంతి): నీటి ట్యాంక ర్ బుకింగ్ కోసం జలమండలి మెట్రో కస్టమర్ కేర్ సెంటర్ (ఎంసీ సీ)కి  ఓ వినియోగదారుడు  శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి ట్యాంకర్ బుకింగ్ కోసం క్యాన్ నంబర్ చెప్పాడు. కానీ ట్యాంకర్ బుక్ కావాలంటే బిల్‌నంబరు కావాలంటూ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ మెలిక పెట్టింది. ఎందుకని ప్రశ్నించగా.. ఫోన్ కట్ చేశారు. మళ్లీ మళ్లీ చేసినప్పటికీ అదే సమాధానం చెప్పారు. జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ సిబ్బంది వింత చేష్టలతో ఆందోళన చెందిన వినియోగదా రుడు వాళ్లు చెప్పినట్టుగా చేశాడు. ఈ విషయంపై జలమండలి ఉన్న తాధికారిని వివరణ కోరగా  ట్యాంకర్ బుకింగ్‌కు కేవలం క్యాన్ నంబరు ఉంటే సరిపోతుందని చెప్పడం కొసమెరుపు.