calender_icon.png 21 January, 2026 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూరారం కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం

21-01-2026 08:23:07 PM

ఐదేళ్ల బాలుడిని గాయపరిచిన వీధి కుక్కలు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూరారం మార్కెట్ మసీద్ పక్క గల్లీలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమ్మిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.వీధి కుక్కలను అరికట్టండని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.