17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రజాపోరాటాలతోనే పార్టీ బలోపేతం

07-01-2026 12:00 AM

ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించాలి

మున్సిపల్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి

సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

నల్గొండ టౌన్, జనవరి 6: ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీఅన్నారు మంగళవారం స్థానిక ఏం ఎస్ గార్డెన్ లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లా డుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని, ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించాలని కోరారు. పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏకైక పార్టీ ఎర్రజెండా అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా ఉద్యమాలు నడిపించే నాయకులకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని, సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకమై కమ్యూనిస్టు నాయకులను ఓడించారని ప్రజల అండతో అనేకచోట్ల గెలిచారని గుర్తు చేశారు.

డబ్బు, మద్యంతో మభ్యపెట్టిన నిజమైన ప్రజా నాయకులకు గెలిపించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో పేదవారికి అన్యాయం చేసే విధంగా విధానాలు తీసుకొస్తున్నారని వీటిని తిప్పుకొట్టేందుకు ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విధానాలతో దేశాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు చెందాల్సిన సంపద బడా బాబులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. వాటిని కాపాడుకునేందుకు దేశ వ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలన్నారు. ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు నిలవాలన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూల కంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రo లో అప్పులు చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు బలమైన ప్రజా పోరాటాలు చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బి ఆర్ ఎస్ అధినేత అసెంబ్లీలో ఉండకపోవడం సరినది కాదన్నారు. రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించాలన్నారు. ప్రభుత్వము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉద్యమాలు జరపాల్సిన బాధ్యత ప్రతిక్షాలకు ఉందన్నారు. దేశంలో భూతులు తిట్టుకోవడంలో రాష్ట్రo నంబర్ వన్ గా ఉందన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి బూతులు తిట్టుకుం టూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కవిత బి ఆర్ ఎస్ ను విడిపోయి గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల పై ఆరోపణలు చేస్తుందని చెప్పారు.

ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పడంతో పాటు సిపిఎం విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్ళునేందుకు ప్రజా ఉద్యమాలు చేయాలన్నారు. భవిష్యత్ దేశానికి కమ్యూనిస్టులు అవసరమన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా అభిమానం గెలుచుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా లో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం అని పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాలు చేసి జిల్లాను ముందు బాగాన ఉంచుతామని అన్నారు నల్గొండ జిల్లాలో సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్‌ఎల్బీసీకి నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసినందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో జిల్లా అభివృద్ధి సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సిపిఎం సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు శాలువాతో సన్మానించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.