07-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 6(విజయ క్రాంతి): తిరిగి విధుల్లో చేరిన చిట్యాల ఎంపిడిఓ ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. చిట్యాల మండల ఎంపీడీవో ఎస్.పి. జయలక్ష్మి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో చిన్న కాపర్తి గ్రామంలో జరిగిన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన సంఘటనలో ఎంపీడీవోను, పలువురు ప్రభుత్వ అధికారులను విధుల నుండి బహిష్కరించగా, తిరిగి ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరిన సందర్భంగా ఆమెను మర్యాదపూర్వకముగా కలిసి కాంగ్రెస్ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి ఎంపీడీవో జయలక్ష్మిని శాలువాతో సన్మానించారు. మళ్లీ విధుల్లోకి చేరడం చిట్యాల మండల ప్రజలు, నాయకులు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.