07-01-2026 12:00:00 AM
ఘట్‌కేసర్, జనవరి 6 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో స్వర్గీయ గేయ రచయిత అందెశ్రీ సమాధి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్మృతివనం స్థలాన్ని మంగళవారం అధికారులు సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ నిధులతో ఎకరా 22 గుంటల స్థలంలో ఏర్పాటు చేసే స్మృతి వనంలో ఓపెన్ ఆడిటోరియం, పలు అభివృద్ధి పనులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్శనలో భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్కిటెక్ ఉషారెడ్డి, ఆర్ అండ్ బి సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. రవిశంకర్, ఈఈ శ్రీనివాసమూర్తి, దినేష్, తహసిల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తాసిల్దార్ రాజేందర్, ఆర్‌ఐ సాయిరాం, అందెశ్రీ కుమారుడు దత్త సాయి, నాయకులు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.