ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
కలెక్టర్ కే. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 1(విజయ క్రాంతి): జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మొత్తం ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
కాగజ్నగర్ పెద్దవాగు ప్రాంతం నుంచి రాంపూర్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోగా, ఆసిఫాబాద్ మండలం లో మరో నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. సహజ వనరులను అక్రమంగా దోపిడీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు కూడా సమాచారం అందించాలని ఆమె కోరారు.
‘మన ఇసుక’ వాహనం ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం..
ప్రజలకు ఇసుక సరఫరాను సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక’ విధానం కింద ఇసుక వాహనాల ఆన్లైన్ బుకింగ్ను జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. ఆసిఫాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా ఇసు క బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డు గదిని పరిశీలించి భూమి సంబంధిత రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ లోకేశ్వర్, జిల్లా మైనింగ్ అధికారి గంగాధర్, తహశీల్దార్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. సిర్పూర్ (టీ) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బంది సమయపాలన పాటించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.
వేసవిలో తీసుకో వాల్సిన జాగ్రత్తలపై రోగులకు అవగాహన కల్పించాలని, ఆస్పత్రిలో అవసరమైన మం దుల నిల్వ ఉండాలని సూచించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సంద ర్శించి ధరణి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, తహశీల్దార్ రహీముద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
జనాభా లెక్కలు పకడ్బందీగా చేపట్టాలి..
రాబోయే జనాభా లెక్కలు2027 ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఫీల్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన ఫీల్ ట్రైనర్లు గణికులు, సూపర్వైజర్లకు సరైన అవగాహన కల్పించి డేటా సేకరణను ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటి సమాచారాన్ని తప్పులేకుండా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సీపీఓ వాసుదేవ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.




