2 April, 2026 | 3:17 AM

ఘనంగా విఠలేశ్వర కల్యాణం

02-04-2026 12:00 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 1 (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో విఠలేశ్వర కళ్యా ణాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే గ్రామంలో నిర్వహిస్తున్న సప్తహ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి చేతుల మీదుగా గ్రామ పురోహితులు సంజీవరావు శర్మ ఆధ్వర్యంలో విఠలేశ్వర కళ్యాణి ఘనంగా జరిపించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.కళ్యానోత్సవ కార్యక్రమం లో భాగంగా గ్రామం లో పండుగ వాతావరణం సంతరించు కుంది.