20-11-2025 12:33:18 PM
మంథని ఎస్ఐ డేగ రమేష్ హెచ్చరిక
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణ, మండలంలోని ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంథని ఎస్ఐ డేగ రమేష్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా, లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టరాదని, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లయితే వారి పైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడునని ఎస్ఐ హెచ్చరించారు.