20-11-2025 12:22:24 PM
ఘటనా స్థలాన్ని పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్,(విజయక్రాంతి): రెండు స్కూల్ బస్సులను గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి సమయంలో తగలబెట్టిన సంఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో ని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్ (క్రిస్టియన్ మిషనరీ) కొంత కాలంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కళాశాల రెండు విద్యాసంస్థలుగా నిర్వహిస్తున్నారు.
వివిధ గ్రామాల నుండి విద్యార్థులు స్కూలుకు తీసుకురావడానికి బస్సులను ఏర్పాటు చేసారు.రోజులాగే పాఠశాల ముగిసిన తర్వాత పాఠశాల ఆవరణలో తమకున్న బస్సులను పార్కింగ్ చేశారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో రెండు స్కూల్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారైయ్యారు. పాఠశాల ఆవరణంలో మంటలు, సౌండ్ రావడంతో గమనించిన పాఠశాల యజమాన్యం. బస్సులు కాలిపోతుండంతో మంటలు అర్పించే ప్రయత్నం చేసినప్పటికీ వీలుకాకపోవడంతో ఫైర్ స్టేషన్, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పాఠశాల యజమాన్యం పోలీస్ లకు పిర్యాదు చేశారు. నిప్పు అంటించిన దుండగులను పట్టుకుని శిక్షించాలని పాఠశాల యాజమాన్యం కోరారు. పాఠశాలలో ఉన్న సిసి ఫుటేజ్ ను పరిశీలించి అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలాని పరిశీలించిన ఎమ్మెల్యే: వేముల వీరేశం
కేతేపల్లి మండలం రాయపురం గ్రామంలో సెయింట్ ఆన్స్ స్కూల్ లో జరిగిన స్కూల్ బస్ ల అగ్ని ప్రమాదఘటన స్థలాని గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.వెంటనే విచారణ చేపట్టి ప్రమాదాని కారకులు ఎవరైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీశరత్ చంద్ర పవార్ , అధికారులుని కోరారు. వీరి వెంట. ఇనుపాముల మాజీ ఎంపీటీసీ బొజ్జ సుందర్. పన్నాల రాఘవరెడ్డి , లింగాల వెంకన్న , దయాకర్ రెడ్డి ఎం ఈ ఓ మేక నాగయ్య తదితరులు ఉన్నారు.