20-11-2025 12:26:47 PM
మంథని,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ లో ఇటీవల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ (Naveen Yadav)ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపులో ఎంతో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కూడా శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలిపారు.