20-11-2025 12:28:35 PM
స్పెషల్ డీసీ రాజు కు రైతుల విన్నతి
కడ్తాల్ ,(విజయక్రాంతి): గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ సేకరణలో భూములు కోల్పోయే బాధిత రైతులకు ఎకరానికి ఒక కోటి పరిహారం ఇవ్వడం తో పాటు ఫ్యూచర్ సిటీలో ఒక ప్లాటును ఇవ్వాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజుకు రైతులు విన్నవించారు. బుధవారం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో గతంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పై వచ్చిన పిర్యాదులపై విచారణ చేప్పట్టారు.
ఈ సందర్బంగా బాధిత రైతు లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు రైతులు తమ అభిప్రాయాలను విన్నవించారు. భూ సేకరణ లో భూములు కోల్పోయే రైతులకు భూమికి భూమి పరిహారం ఇవ్వాలని, కుదరని పక్షంలో మొదటి ఫేస్ లో కొంగర కలాన్ లో రైతులకు ఇచ్చిన మాదిరి గానే ఎకరాకు కోటి రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో రైతులు జోగు వీరయ్య, పాలకుర్ల కరుణాకర్, రమేష్ నాయక్, జెన్నయ్య, పండయ్య, నారాయణ, జి నరేష్, శివ, నర్సింహా, మల్లయ్య మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు