calender_icon.png 20 November, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమిని కబ్జా చేసారని మాహిళా రైతుల ఆవేదన

20-11-2025 12:31:12 PM

న్యాయం చేయాలని అదికారుల చుట్టూ ప్రదక్షిణలు.

పట్టించుకోని అదికారులు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన పలితం శూన్యం.

కబ్జాదారులకే అదికారుల వత్తాసు.

కబ్జాదారుల నుండి కాపాడాలని వేడుకోలు.

తలకొండపల్లి: వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకుని మాపై అన్యాయంగా దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండలంలోని గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన మాహిళా రైతులు(Women farmers) గన్నోజు సరస్వతి,గన్నోజు పుష్పాలమ్మ లు కన్నీరుమున్నీరౌతు తమ గోడును వెళ్లబోసుకున్నారు.గ్రామానికి చెందిన గన్నోజు సరస్వతి,పుష్పాలమ్మ లకు తమ పెద్దల నుండి గ్రామ రెవెన్యూ పరిదిలోని సర్వే నెంబర్ 70/ఇ/2 లో 0.20 గుంటల భూమి సంక్రమించింది.అట్టి భూమి మహిళల భావ ఐయిన గన్నోజు బుచ్చయ్య అనే అతని పేరున రికార్డ్ లో రిజిస్టేషన్ ఉంది.

బుచ్చయ్య పేరున ఉన్న భూమిని అతనిని నుండి మేము 2019 లో తమ పేర్ల పై రిజిస్టేషన్ చేయించుకుని కడీలతో పొలం చుట్టు ఫెన్సింగ్ వేశామని చెప్పారు.ఇదిలా ఉండగా 2023 లో కొందరు తమ భూమి చుట్టు వేసిన కడీలను ద్వంసం చేసి కబ్జా చేసి తమను భూమిలోకి రానియడం లేదని వాపోయారు.పొలం వద్ద రౌడిలను ఏర్పాటు చేసి తాము వెలితే తమ పై దాడులు చేయిస్తూ  భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా తమ పైనే పోలిస్ కేసులు నమోదు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఆ భూమి పైకి వెలితే మీపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు వేదిస్తున్నారని మాహిళా రైతులు సరస్వతి,పుష్పాలమ్మ లు పేర్కొన్నారు.ఉన్నతాదికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మాహిళా రైతులు వేడుకుంటున్నారు.

మాహిళా ఆరోపణ తప్పు:  ఆమనగల్ సీఐ జానకిరాంరెడ్డి

గట్టుఇప్పలపల్లి గ్రామ మాహిళా రైతుల ఆరోపణలపై ఆమనగల్ సీఐ జానకిరాంరెడ్డి ని వివరణ కోరగా వారి ఆరోపణలు తప్పని చెప్పారు.ఇతరుల భూముల పైకి వెళ్లి తమదని వాదించడం కరెక్ట్ కాదన్నారు.ఇట్టి విషయమై ఫీల్డ్ మీదికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు.మహిళలు తమదని వాదిస్తున్న పొలం వారిది కాదన్నారు.సర్వే నంబర్ ను కొలతలు వేయించి చుసుకొవాలని చెప్పడం జరిగిందన్నారు.ఐన పొలం పైకి వెళ్లి దౌర్జన్యంగా వ్యవహరించడంతో పది రోజుల క్రితం వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.ఎవరైన సరే ఇతరుల భూముల పైకి వెళ్లి దౌర్జన్యం చేస్తే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించనున్నట్లు సీఐ జానకిరాంరెడ్డి వివరించారు.