13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు

31-03-2026 12:26 AM

ఎస్‌ఐ తిరుప్పాజీ 

కోయిలకొండ, మార్చి 30 : అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్త్స్ర తిరుప్పాజి అన్నారు. మండలంలో కొత్తలాబాద్, మల్లాపూర్ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి ఇసుక కొడుతున్నారని సమాచారం రావడంతో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్త్స్ర తెలిపారు. అర్ధరాత్రి ఎవరు చూడడం లేదని ఎవరు పడితే వారు అక్రమంగా ఇసుక తరలింపు కు పాల్పడితే వదిలిపెట్టబోమని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లో వాగుల్లోకి ఇసుక ట్రాక్టర్లు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అనుమతి తప్పనిసరిగా తీసుకుంటేనే నియమ నిబంధనలు పాటించి ఇసుక రవాణా చేయాలని లేనియెడల కేసులు పెట్టడం ఖాయమని హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలింపులకు పాల్పడితే 100కు కాల్ చేయాలని తక్షణమే పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.