13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆశాల సమస్యలు పరిష్కరించాలి

31-03-2026 12:23 AM

ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి

జడ్చర్ల, మార్చి 30: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో చేయకూడదని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జడ్చర్ల లోని నేషనల్ హైవే 44 రహదారిపై భారీ ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా కార్యకర్తలకు ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదు పైగా పని భారాన్ని పెంచారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తన మేనిఫెస్టోలో ఆశలకు రూ 18 వేలు ఫికస్డ్ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పోరాట ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి తెలుగు సత్తయ్య, నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు రామయ్య, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సావిత్రి, సాధన, నిర్మల, హైమావతి, యాదమ్మ, పద్మ, అమృత, శివ లీల,తదితరులు పాల్గొన్నారు.