ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఆర్డీవో అశోక్ రెడ్డి
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ భూములను కబ్జాల పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని ఆర్డిఓ అశోక్ రెడ్డి సుంకనపల్లిలోని ఆక్రమణకు గురైన భూమిని మంగళవారం పరిశీలించి హెచ్చరించారు. చిట్యాల మండలంలోని సుంకేనపల్లి రెవిన్యూ గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 20, 61లలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకు పాల్పడగా, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని మంగళవారం నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి పరిశీలించి ఉపాధి హామీ కూలీల సహకారంతో మొక్కలు నాటించారు. ఆయన మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణకు గురైన భూమిలో వీలైనంత తొందరగా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయవలసిందిగా ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతో పాటుగా చిట్యాల తహసీల్దార్ కృష్ణనాయక్, కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






