calender_icon.png 17 September, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష

16-09-2025 10:36:40 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): హత్య కేసులో నిందితునికి 10 సంవత్సరముల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. కృతవరం గాజులు రామ్ బస్తికి చెందిన బడికెల నరేష్ ఫిర్యాదు ప్రకారం కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ టెంపుల్  ఏరియాలో 24.10.2022 తేదీన రాత్రి 7.50 గంటలకు బడికెల సంతోష్ కుమార్ @ బాబీ అనే వ్యక్తి ఆర్కే సూపర్ మార్కెట్ పక్కన గల రాకేష్ పాండ్ షాపు వద్ద సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడని పాన్ షాప్ లో రాకేష్ డబ్బులు ఇవ్వకుండా రాజేష్ తో కూడా రాకేష్ తో గొడవ పడుతుండగా సాయికుమార్ సంతోష్ కుమార్ ను సీరియల్ డబ్ల్యూ ఇవ్వమని గట్టిగా మందలించగా నువ్వు ఏందిరా నాకు చెప్పేది.

నా ఇష్టం వాడికి డబ్బులు ఇవ్వను అంటూ సాయికుమార్ సంతోష్ కుమార్ మెడ మీద గట్టిగా కొట్టగా సాయికుమార్ నన్నే కొడ తావా నిన్ను ఇప్పుడే చంపేస్తా అంటూ సంతోష్ కుమార్ ను నెట్టగా పాన్ షాప్ ప్రక్కనున్న రోడ్డు మీద పడిపోగా పక్కనే ఒక సిమెంటు ఇటుక తీసుకొని తలమీద బలంగా రక్తం కారు చుండగా సాయికుమార్ చనిపోయినాడు అనుకొని సాయికుమార్ పారిపోయినాడు అని వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినాడు అని ఫిర్యాదు ఇవ్వగా, పల్లం సాయికుమార్ @ జగడం సాయి S/o.బాబురావు,21yrs, R/o.గాజుల రాజo బస్తీ, కొత్తగూడెం  దాడి చేసి హత్య చేసిన ఘటనలో ఫిర్యాదు అందుకున్న కొత్తగూడెం త్రీ టౌన్ అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.అబ్బయ్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టులో 15 మంది సాక్షులను విచారించారు.  ఇరుపక్షాల వాదోపవాదాలు విని పళ్లెం సాయికుమార్ @ జగడం సాయి పై నేరం రోజు కాగా, 10 సంవత్సరాల కఠిన కారగార శిక్ష, ఒక వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు..అనంతరం ప్రస్తుత కొత్తగూడెం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఇట్టి కేసు విచారణను ముందుకు సాగించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ ప్రాసిక్యూషన్ నిర్వహించగా, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎన్.వీరబాబు ( కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ) కోర్టు పిసి. హేమీ లాల్ లు సహకరించారు.