13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పకడ్బందీగా నామినేషన్ ప్రక్రియ

30-01-2026 12:45 AM

ఎన్నికల నిర్వహణ పక్కాగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్

తాండూరు, జనవరి29 (విజయ క్రాంతి):  జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలని, ఏవైనా సందేహాలు తలెత్తినట్లయితే వెంటనే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. 

1 నుండి 36 వార్డులు 12 కౌంటర్లు, 12 మంది ఆర్ ఓ లు నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు  కలెక్టర్ తెలిపారు. నామినేషన్లు దాఖ లు చేసే విషయం లో  అభ్యర్థు లకు అవసరమైన సహకారం అందించాలని, ఏమైనా సందేహాలు ఉంటే సొంత నిర్ణయం తీసుకోకుండా పై అధికారులను సంప్రదించాలని సిబంది కి సూచించారు.  జిల్లాలో మొత్తం 100 వారడ్స్, 261 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం తో పాటు 54 సమస్యా త్మ క లొకేషన్ లు గుర్తించి పూర్తి స్థాయి లో పోలీస్ బందోబస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ ఓ లు, ఓ ఆర్  ఓ లు 20% అదనంగా  సిబ్బంది ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల నియమావళి పక్కాగా అమలయ్యేలా చూస్తామన్నారు.