డ్రగ్స్ కట్టడికి పటిష్టమైన నిఘా
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జులై 7 (విజయక్రాంతి) : గంజాయి వంటి మాదకద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలను నిర్మూలించుటకు తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు ,కళాశాల లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లా ఎక్సైజ్ అధికారి న ర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లు కు 2024-2025 వ సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 వ సంవత్సరానికి 410. 44 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరిందన్నా రు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు ప దార్థాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు అవ గాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం ముస్తఫా, మాన్ సింగ్, రాజేష్, రామచందర్, ఖాజా ఆహమ్మద్, హరీష్ పాల్గొన్నారు.






