8 July, 2026 | 1:55 AM

రాజ్యాంగ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం

08-07-2026 12:00 AM

మలక్‌పేట్, జూలై 7 (విజయక్రాంతి): దేశ రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో సిపాహే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన 300 జీహెచ్‌ఎంసీ వార్డుల్లో భారత రాజ్యాంగ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మలక్పేట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సమావేశం  చంచల్గూడలోని సిపాహే ఎన్జీఓ, ఎఫ్.ఎం.కె లా అసోసియేట్స్ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశాన్ని అడ్వకేట్ ఫజిల్ మహమ్మద్ ఖాన్ నిర్వహించగా, కాన్ఫెడ్‌సోమో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. మహేశ్వర్ రాజ్ అధ్యక్షత వహించారు. మలక్పేట్ నియోజకవర్గంలో రాజ్యాంగ అవగాహన కార్యక్రమాన్ని గ్రామీణ, బస్తీ స్థాయిలో విస్తృతంగా చేపట్టేందుకు వ్యూహరచన చేయడం సమావేశ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ చేరవేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. నదీముల్లా హుస్త్స్రనీ ,  జట్పట్ నగర్ బస్తీకి చెందిన ప్రముఖ నాయకుడు కాశయ్య, చంచల్గూడలోని సీఎస్కే దేవాలయం, ఫతేఖాన్ బజార్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాంచంద్రతో పాటు యువ నాయకులు సయ్యద్ సమీర్, అబ్దుల్లా మహమ్మద్ ఖాన్,  సమావేశంలో పాల్గొన్నారు.