19 June, 2026 | 1:32 AM

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి

19-06-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజనుల్లో నెలకొన్న ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్ డివిజన్ పరిధిలోని బాలాపుర బస్తీలో చాలా కాలంగా వీధి దీపాలు, చెత్త తరలింపు సమస్యలతో పాటు చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారాయని నివాసితులు చెబుతున్నారు.

ఈ మేరకు గురువారం విషయాన్ని స్థానిక బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బిట్ల శ్రీనివాస్ రాజ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు పడుతున్న ఇబ్బందిని గోవర్ధన్ రెడ్డి వివరించారు. బాలాపుర బస్తీలో అనారోగ్యకర వాతావరణం నెలకొంటోందన్నారు. పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా వాహనదారులు, స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన గోవర్ధన్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో ఫో ను ద్వారా మాట్లాడారు.

సమస్య తీవ్రతను వివరించి వెంటనే పరిష్కరించాలని డిమాం డ్ చేశారు. అనంతరం నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వారి వద్దకు వెళ్లి స్వయంగా సమస్యను తెలుసుకోవాలన్నారు. ఆ సమస్య పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణు, మురళి, అరుణ్, అనుబు, బలరాం, మదన్, సాయిలు, ధర్మేంద్ర, రావుల జగన్ తదితరులు పాల్గొన్నారు.